అనంతపురం జిల్లా బత్తలపల్లిలోని ఎన్ఆర్కే కల్యాణ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. వైర్లు చుట్టి ఉంచటంతో విద్యుతాఘాతం జరిగి మంటలు రేగాయి. మంటపంలోని సామగ్రి కాలిపోయింది. సమాచారం అందుకున్న ధర్మవరం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులో చేశారు. అప్పటికే సుమారు రూ.6 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని యజమాని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బత్తలపల్లి పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
కల్యాణ మండపంలో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం - ధర్మవరం అగ్నిమాపక సిబ్బంది
బత్తలపల్లిలోని ఎన్ఆర్కే కల్యాణ మండపంలో విద్యుదాఘాతం వల్ల సుమారు రూ. 6 లక్షలకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
![కల్యాణ మండపంలో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం fire accident in Kalyana mandapam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9488910-417-9488910-1604927681056.jpg)
కల్యాణ మండపంలో అగ్ని ప్రమాదం