అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.4లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానిక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో అనిల్‌కుమార్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఉన్నట్టుండి అతని ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సిలిండర్ ఉండడంతో ఎవరూ మంటలను అదుపు చేయడానికి ఇంట్లోకి వెళ్లలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అర్పివేశారు.
విద్యుత్‌షార్ట్ సర్క్యూట్.. ఇల్లు దగ్ధం.. - అనంతపురం జిల్లా వార్తలు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.4లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కళ్లముందే ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యిందని బాధితులు కన్నీరుమున్నీరు అయ్యారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో జరిగింది.
విద్యుదాఘాతానికి ఇల్లు దగ్ధం
ఈ ప్రమాదంలో బీరువాలో ఉన్న 50 గ్రాముల బంగారం, రూ.75 వేల నగదు, పట్టు చీరలతో పాటు టీవీ, ఫర్నీచర్ తదితర వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు నాలుగు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు అనిల్ కుమార్, అతని భార్య ఈశ్వరి వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: రాయదుర్గంలో తేదేపా ఇంటింటి ప్రచారం