ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంచనామా చేయకుండా మృతదేహాన్ని ఎలా పంపిస్తారు?' - fire accident news in rampuram

అగ్నిప్రమాదాన్ని అదుపు చేసే క్రమంలో మంటలు అంటుకుని చనిపోయిన ఉద్యోగి మృతదేహాన్ని అధికారులు బెంగళూరులోని స్వగృహానికి తరలించారు. కానీ.. ఎలాంటి ఎఫ్​ఐఆర్ లేకుండా.. కనీసం శవ పంచనామా చేయించకుండా ఎలా తరలిస్తారని కుటుంబీకులు అభ్యంతరం చెప్పారు. మృతదేహాన్ని తిరిగి పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు.

పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన ఉద్యోగి మృతదేహం
పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన ఉద్యోగి మృతదేహం

By

Published : Apr 28, 2020, 2:50 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురంలోని ఉదయ్‌ ట్రేడర్స్ అనే పరిశ్రమ వ్యర్థాల నిల్వ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో... అగ్నిమాపక శకటం ఉద్యోగి మృతిచెందాడు. స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండానే, శవ పంచనామా చేయించకుండానే మృతదేహాన్ని బెంగళూరులోని ఆయన స్వగృహానికి తరలించారు.

ఈ విషయంపై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తిరిగి ఈరోజు ఉదయం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. తన భర్త మృతి చెందిన తీరుపై.. తమకు న్యాయం చేయాలని మృతుృడి భార్య వేడుకుంది.

ABOUT THE AUTHOR

...view details