అనంతపురం జిల్లా ధర్మవరంలోని సుదర్శన్ కూడలి వద్ద ద్వారక మయ హోల్ సేల్ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. కరెంట్ నిలిచిన అనంతరం ఒక్కసారిగా మళ్లీ విద్యుత్ రావటంతో ఇన్వర్టర్ నుంచి సర్ట్ సర్య్కూట్ జరిగింది. ఇందువల్లే అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో 50 లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగిందని వస్త్ర దుకాణం యజమాని రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు.
వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం.. రూ.50 లక్షలు ఆస్తి నష్టం - అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం తాజా వార్తలు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వస్త్ర దుకాణం దగ్ధమైన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. రూ. 50 లక్షల విలువైన వస్త్రాలు అగ్నికి కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపివేసి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
![వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం.. రూ.50 లక్షలు ఆస్తి నష్టం Fire accident in a clothe store](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9780544-539-9780544-1607225741284.jpg)
వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం
ఇవీ చూడండి..