అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం ఆందోళన రేపింది. సుమారు రాత్రి 11:30 సమయంలో కొవిడ్ వార్డులో ఉన్న రికార్డు గదిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. రికార్డు రూమ్ పక్కనే 24 మంది కొవిడ్ బాధితులు చికిత్సపొందుతున్న వార్డు ఉంది. ప్రమాదంపై వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆసుపత్రి ఎదురుగానే అగ్నిమాపక కేంద్రం ఉండడంతో పెనుప్రమాదం తప్పంది. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పింది.
- పూర్తిస్థాయిలో చర్యలు
అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబుతో సహా అన్ని విభాగాల అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలివచ్చి ప్రమాదంపై పర్యవేక్షించారు. పూర్తిస్థాయిలో మంటలను ఆర్పే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగిన వెంటనే కొవిడ్ వార్డులో ఉన్న బాధితులను మరో వార్డుకు తరలించామని అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ చిన్న గాయం కూడా కాలేదని మంటలు వ్యాపించకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామని వారు చెప్పారు.
- ఎలాంటి నష్టం జరగలేదు : ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి