అధిక ఓల్టేజి కారణంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది కొంతసేపు శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. షేక్ అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా దగ్ధమవగా.. 4 లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు.
అధిక ఓల్టేజీతో గుంతకల్లులో అగ్ని ప్రమాదం - hose fired in high voltage in guntakal
అనంతపురం జిల్లా గంతకల్లులో ఓ ఇల్లు అగ్నికి ఆహుతయ్యింది. 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. కొన్ని రోజుల్లో కుమార్తె పెళ్లి ఉండగా.. సామాగ్రి మొత్తం కాలిపోయిందని బాధితుడు షేక్ అబ్దుల్ రషీద్ కన్నీటి పర్యంతమయ్యాడు.
గుంతకల్లులో అగ్ని ప్రమాదం
అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో కుమార్తె పెళ్లి ఉందని.. వివాహానికి సంబంధించిన సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యిందని బాధితుడు విలపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో తెదేపా కార్యకర్త మృతి.. ఎమ్మెల్యే నివాళి