అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన రైతు ఓబులేష్ కంది పంట వేశాడు. చేతికొచ్చిన పంట కోసి గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉంచాడు. మరో రైతు నరసింహులు కూడా ఓ ట్రాక్టర్ ఉలవ పంట నూర్పిడి కోసం అదే ప్రదేశంలో వేసుకున్నాడు. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ పంటకు నిప్పు పెట్టారు. దూరాన మంటలు కనిపించటంతో రైతులు అక్కడకు చేరుకునేసరికే పంట పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు.
అగ్నికి కంది పంట ఆహుతి.. అన్నదాత అదోగతి - అనంతపురం జిల్లాలో పంట దగ్ధం తాజా వార్తలు
చేతికొచ్చిన పంటను గుర్తుతెలియని వ్యక్తులు బుగ్గిపాలు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో పంటకు దుండగులు నిప్పుపెట్టారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట ఆగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు.
పంటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు