ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం మున్సిపల్ మార్కెట్​లోని షాపులో అగ్నిప్రమాదం

అనంతపురం మున్సిపల్ మార్కెట్​లో అగ్నిప్రమాదం జరిగింది. కంప్యూటర్​ రిపేరింగ్​ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

By

Published : Mar 5, 2021, 5:25 PM IST

fire accident
అనంతపురంలో అగ్నిప్రమాదం

అనంతపురం టవర్ క్లాక్ సమీపంలోని మున్సిపల్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం జరిగింది. కంప్యూటర్ల మరమ్మతుల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బంద్​ కారణంగా దుకాణాలన్నీ మూసివేసినా.. కూరగాయల మార్కెట్ మాత్రం తెరిచే ఉంచారు. ఈ క్రమంలో ఓ దుకాణం నుంచి పొగ వస్తుండటంతో వ్యాపారులు గుర్తించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు మంటలను అదుపు చేయటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది.

ఈ ప్రమాదంలో రిపేరుకు వచ్చిన కంప్యూటర్లు, ప్రింటర్లతోపాటు అమ్మకానికి తెచ్చిన అనుబంధ వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపకశాఖ సిబ్బంది ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు. అలాగే దుకాణంలో వస్తువులకు జరిగిన ఆర్థిక నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండీ..ఏపీ ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్​ను ప్రారంభించిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details