అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం మేలపురంలో ఓ ప్రైవేటు పాఠశాల పక్కన ఉన్న దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రైవేట్ పాఠశాల ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన కారణంగా.. ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పెను ప్రమాదం తప్పిందని పాఠశాల యాజమాన్యం, విద్యార్థినీవిద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.