అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రి కూడలి వద్ద ఉన్న వినాయక ఆటోమొబైల్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు.. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తాళం వేసి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని యజమాని రమణ తెలిపారు. రూ.5 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని వాపోయారు.