ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్యాస్ సిలిండర్ పేలి.. టీ దుకాణం దగ్ధం - ananthapuram

అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి టీ దుకాణం దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తమయ్యి మంటలు ఆర్పటంతో పెను ప్రమాదం తప్పింది.

అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం

By

Published : Jul 29, 2019, 10:50 AM IST

గ్యాస్ సిలిండర్ పేలి.. టీ దుకాణం దగ్ధం

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక కొల్లపురమ్మ ఆలయ సమీపంలో రామలింగ అనే వ్యక్తి టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి.. ఆ వేడికి గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలార్పటంతోపెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details