ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ ​షార్ట్ సర్క్యూట్​తో షెడ్డు దగ్ధం.. - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలోని వి.అగ్రహారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మల్బరీ షెడ్​​లో విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​తో నిల్వ ఉంచిన విత్తనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.2 లక్షల నష్టం వచ్చిందని బాధితులు తెలిపారు.

fire accident at amarapuram ananthapuram
మల్బరీ షెడ్డులో అగ్నిప్రమాదం

By

Published : Jun 14, 2020, 1:17 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలోని వి.అగ్రహారం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నరసింహమూర్తి అనే రైతు మల్బరీ షెడ్డుకు ఏర్పాటు చేసిన విద్యుత్​ సర్వీసు వైరుకు మంటలు చెలరేగి షెడ్డు మొత్తం అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో షెడ్​లో ఉన్న వ్యవసాయ సామగ్రి, ఎరువులు, బియ్యం, రాగులు, జొన్నలు, వేరుశనగ విత్తనాలు అగ్నికి కాలి బూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేదు. సుమారు రూ.2 లక్షలు వరకు పంట నష్టం వాటిల్లింది. విత్తేందుకు సిద్ధంగా ఉంచిన విత్తనాలు అగ్నికి ఆహుతవ్వడంతో, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నారు.

మల్బరీ షెడ్డులో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details