అనంతపురం జిల్లా కంబదూరు మండలం నుతిమాడుగు గ్రామంలో.. అక్రమంగా ఎడ్లబండ్లలో ఇసుకను తరలిస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్లబండ్లను సైతం పోలీసులు స్టేషన్కు తరలించారు. మూగజీవాలైన పది ఎడ్లకు మేత, నీరు అందించకపోవడంతో అవి ఆకలితో అలమటిస్తున్నాయి.
వాహనాల్లో ఇసుకను తరలిస్తే..వాటికి జరిమానా విధించేవారు. కానీ ఇలా ఎడ్లబండ్లను పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని చూసి స్థానికులు అవాక్కయ్యారు. అంతేకాకుండా మూగజీవాలకు జరిమానా విధిస్తారనటంతో.. అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.