అనంతపురం జిల్లా పెనుకొండలో పోలీసులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని.. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. భౌతిక దూరం పాటించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
కరోనా నిబంధనలపై అవగాహన... మాస్కు ధరించని వారికి జరిమానా - ananta police fine imposed news
కరోనా విజృంభిస్తుంటే కొంత మంది తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడిగా మాస్కులు లేకుండా సంచరిస్తున్నారు. వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కరోనా నిబంధనలపై అవగాహన కల్పిస్తూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారికి జరిమానా విధిస్తున్నారు.
police imposed fine who dont wear mask