అనంతపురం జిల్లా యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లి గ్రామం వద్ద ఉన్న పెన్నా సిమెంట్ కర్మాగారంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు. కర్మాగారంలోని కాలేజ్ ఆఫ్ సిమెంట్ సైన్సెస్ హాస్టల్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం కర్మాగారం ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల్లో స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తోందన్నారు.
విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారికి కోర్సులు అయిపోయిన వెంటనే ఉద్యోగావకాశాలు కల్పించడమే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి అన్నారు. పెన్నా సిమెంట్ యాజమాన్యం కాలేజ్ ఆఫ్ సిమెంట్ సైన్సెస్ ఏర్పాటు చేయడం చాలా హర్షించ దగ్గ విషయమని పేర్కొన్నారు. దీని ద్వారా స్థానికులకు చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు.