Pushed Out of Moving Train: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. రైలు సీట్ కోసం ఘర్షణ పడుతున్న వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ట్రైన్లో నుంచి తోసేశారు. ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కుమ్మవారిపల్లికి చెందిన రమేశ్‌కుమార్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. రైలులో హైదరాబాద్‌కు వెళ్తుండగా అనంతపురం రైల్వేస్టేషన్ దాటాక.. తోటి ప్రయాణికులు సీటు కోసం ఇద్దరు గొడవ పడుతుండగా.. రమేశ్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు గొడవ పడుతున్నారని.. తర్వాత స్టేషన్లో సీటు ఖాళీ అయితే కూర్చోవచ్చని చెప్పాడు.
ఆ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని.. రమేశ్ తెలిపారు. వారికి సర్దిచెప్పాక రైలు డోర్ వద్ద కూర్చున్నానని రమేష్ తెలిపాడు. తర్వాత కొద్ది సేపటికి మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తనను కాలితో తన్ని తోసేసినట్లు రమేశ్ చెప్పారు. రైలు నుంచి కిందపడ్డ రమేశ్ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. సుమారు గంటపాటు ముళ్లపొదల్లో పడి ఉన్నట్లు రమేశ్ చెప్పారు. తర్వాత అంబులెన్స్‌కు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వగా వారు రమేశ్‌ను గుత్తి ఆసుపత్రికి తరలించి.. ప్రథమ చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలించారు. ఘటనపై గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Petrol Attack: బాపట్లలో దారుణం.. పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పు