అనంతపురం జిల్లా గుత్తిలోని ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీ యువకులు ఓ ఇంటి ముందు కూర్చుని ప్రతిరోజూ పబ్జీ ఆడడం, జూదం ఆడుతుండటంతో ఆ ఇంటి యజమాని వారిని మందలించారు. ఆ యువకులు ఆయన్ను కొట్టారు. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ నెలకొంది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళతో సహా 9 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ... 9 మందికి తీవ్రగాయాలు - గుత్తిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వార్తలు
ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 9 మంది తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ... 9 మందికి తీవ్రగాయాలు