ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుల మధ్య ఘర్షణ...ముగ్గురికి గాయాలు - యువకుల మధ్య గొడవ

యువకుల మధ్య చేలరేగిన వివాదం కారణంగా ముగ్గురు గాయపడిన ఘటన అనంతపురం జిల్లా మశానంపేటలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

యువకులు మధ్య ఘర్షణ
యువకులు మధ్య ఘర్షణ

By

Published : Apr 24, 2020, 12:19 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణం మశానంపేటలో యువకుల మధ్య వివాదం చేలరేగింది. ఈ ఘర్షణలో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. గంజాయికి అలవాటుపడ్డ ముగ్గురు యువకులను ఈ మధ్య పోలీసులు అదుపులోకి తీసుకొని మందలించారు. ఇదే ప్రాంతానికి చెందిన కొందరు పోలీసులకు సమాచారం అందించారనే అనుమానంతో సదరు యువకులు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఘటనలో గాయపడ్డవారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా..ఘటనకు కారణమైన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details