TDP Leaders Fight: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి.. తెలుగుదేశం మండల కన్వీనర్ల ఎంపిక సమావేశం రసాభాసగా మారింది. అనంతపురం శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. దీనికి మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. వీరి అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ, కుందుర్పి, కంబదూరు మండల కన్వీనర్ ఎంపికలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది... కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ వాగ్వాదంలో కొందరి చొక్కాలూ చిరిగాయి. కార్యకర్తలంతా ఒకే కుటుంబ సభ్యులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని.. నాయకులు ఇరువర్గాలనూ శాంతింపజేశారు. అన్ని పార్టీల్లో ఇలాంటివి సహజమే. మాలో మాకు మాత్రమే ఈ వాగ్వాదాలు.. అందరం తెదేపా కోసమో పని చేస్తామని అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెదేపా మండల కన్వీనర్ల ఎంపిక సమావేశంలో గందరగోళం
TDP Leaders: రాజకీయ పార్టీలలో వర్గపోరు సాధారణమే. కానీ, అవి అరోపణలు, విమర్శల వరకు ఉంటాయి. ఇది మాటల వరకు మాత్రమే. మరి చేతల రూపంలోకి వస్తే, ఇదిగో ఇక్కడ జరిగినట్లు చొక్కాలు చించుకోవటం వరకు వెళ్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
తెదేపా నేతల మధ్య వర్గపోరు