గొడవపడుతున్న ఇద్దరు కుమారులను వారించేందుకు వెళ్లిన తండ్రి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ధర్మవరం మండలం రాంపురం గ్రామానికి చెందిన నారప్పకు కాటమయ్య, రవీంద్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆస్తి విషయం వీరి మధ్య వివాదాలు ఉన్నాయి. శనివారం నారప్ప పెద్ద కుమారుడు కాటమయ్య ఇంట్లో శుభకార్యం ఉండటం వల్ల పందిరి వేశారు. ఆ షామియానా అడ్డుగా ఉందని సోదరుడు రవీంద్ర అన్నతో గొడవపడ్డారు.
తండ్రి ప్రాణం తీసిన తనయుల వివాదం - ఏపీ టుడే న్యూస్
ఇద్దరు కుమారుల మధ్య తగాదా తండ్రి ప్రాణం తీసింది. ఆస్తి వివాదాలు ఉన్న అన్నదమ్ములు...ఇంటి ముందు వేసిన ఓ పందిరి విషయంలో శనివారం గొడవపడ్డారు. గొడవపడుతున్న వారిని వారించేందుకు వెళ్లిన తండ్రిని పెద్ద కుమారుడు పక్కకు తోసేశాడు. కిందపడిపోయిన తండ్రి మృతిచెందారు.
తండ్రి ప్రాణం తీసిన అన్నదమ్ముల గొడవ
మాట మాట పెరిగి అన్నదమ్ములు బాహాబాహీకి దిగారు. వారికి సర్దిచెప్పేందుకు నారప్ప ప్రయత్నించారు. ఆ సమయంలో నారప్పను పెద్ద కుమారుడు కాటమయ్య పక్కకు తోసి వేయడం వల్ల కిందపడ్డారు. కింద పడ్డ నారప్ప మృతిచెందారు. ఈ ఘటనపై నారప్ప చిన్న కుమారుడు రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :బెజవాడ చిన్నోడు.. డ్యాన్స్‌తో ఇరగదీస్తాడు!