అనంతపురం జిల్లా నార్పల మండలం గడ్డంనాగేపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఉపాధి పని చేసిన తరువాత మస్టర్ తీసుకొని బిల్లు చేయాలంటే కనీసం ఒక్కొక్కరి వద్ద వంద నుంచి మూడు వందల రూపాయల వరకు ఫీల్డ్ అసిస్టెంట్ వసూలు చేస్తున్నారని గ్రామస్థుల ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధిహామీ పని చేస్తున్న చోటే కూలీల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ డబ్బులు తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్(viral) అవుతోంది. ఇలా జరుగుతున్న మండల స్థాయి అధికారులు కూడా ఫీల్డ్ అసిస్టెంట్కే వత్తాసు పలుకుతున్నారని గ్రామస్థులు వాపోయారు. అతను డబ్బులు తీసుకోలేదని గ్రామంలో గ్రామసభ పెట్టి గ్రామస్థులందరిని విచారించానని డబ్బులు ఏమి తీసుకోలేదని చెప్తున్నారన్నారు.ఇందులో మండల స్థాయి అధికారులకు వాటా ఉందని అందుకని ఫీల్డ్ అసిస్టెంట్‌ని వెనకేసుకు వస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
video viral: పనిచేసిన చోటే కూలీల నుంచే డబ్బులు వసూలు - గడ్డంనాగేపల్లిలో ఉపాధిహామి పనుల వార్తలు
పొట్టకూటి కోసం ఆ కూలీలు ఉపాధిహామీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కరోనా సమయమైనా ..ఇళ్లు గడవాలని వారు ప్రాణాలకు తెగించి పనులకు వెళ్తున్నారు. కానీ పనిచేసిన చోటే కూలీల ఆ కూలీల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ డబ్బులు వసూలు చేస్తున్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్(viral) అవుతోంది.
పనిచేసిన చోటే కూలీల వద్దనుంచే డబ్బులు వసూలు