ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిగిలో మహిళా కార్మికుల ఆందోళన - పరిగిలో మహిళ కార్మికుల ఆందోళన

తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పరిగి మండలంలోని ఇండియన్ డిజైన్, నిషా గార్మెంట్ పరిశ్రమలకు చెందిన మహిళ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. మహిళ కార్మికులకు మద్ధతు తెలిపిన సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పరిగిలో మహిళ కార్మికుల ఆందోళన
పరిగిలో మహిళ కార్మికుల ఆందోళన

By

Published : Nov 17, 2020, 8:34 PM IST

అనంతపురం జిల్లా పరిగిలో వేతనాలు పెంచాలని కోరుతూ.. ఇండియన్ డిజైన్, నిషా గార్మెంట్ పరిశ్రమలకు చెందిన మహిళ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళలు, రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలు 3 రోజులు కొనసాగనున్నాయి. మహిళ కార్మికులకు మద్ధతు తెలిపిన సీఐటీయూ నాయకులను... పోలీసులు అదుపులో తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

నిరసనగా మహిళ కార్మికులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తలుపులు మూసేసి అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. రెవెన్యూ అధికారులు నచ్చజెప్పడంతో చివరకు తలుపులు తీశారు. భారీగా పోలీసులు చేరుకోవటంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ మహిళా కార్మికులు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:

పోలవరం ఖర్చులో.. ప్రతి రూపాయి బాధ్యత కేంద్రానిదే: మంత్రి అనిల్

ABOUT THE AUTHOR

...view details