Anatapur: అనంతపురం విద్యుత్ తెగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమిదాల లక్ష్మి (44) అనే మహిళ కూలి బళ్లారి విమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దర్గాహోన్నురు గ్రామంలో గత బుధవారం 11 కేవీ విద్యుత్ తీగలు తెగి, ట్రాక్టర్ ట్రాలీ పై పడిన ఘటనలో వన్నక్క (52), రత్నమ్మ (40), శంకరమ్మ (34), పార్వతి (48) లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లక్ష్మి, మహేష్, సుంకమ్మ తీవ్రంగా గాయపడగా బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీ అనే మహిళా కూలీ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. లక్ష్మి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈమె కూడా వ్యవసాయ కూలీగా పని చేసి కుటుంబాన్ని పోషించేదని.. ఇప్పుడు తన భర్తకు ఎవరు దిక్కు లేకుండా పోయారని, బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం విద్యుత్ తీగలు తెగిన ప్రమాద ఘటనలో మరో మహిళ మృతి.. - ఏపీ క్రైమ్ వార్తలు
Anatapur: అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దర్గాహోన్నురు గ్రామంలో గత బుధవారం 11కేవీ విద్యుత్ తీగలు తెగి.. ట్రాక్టర్ ట్రాలీపై పడిన ఘటనలో గాయపడిన మహిళ బళ్ళారి విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.
విద్యుత్ ప్రమాదం