రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఫాదర్ ఫెర్రర్ జయంతి సందర్భంగా అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్పెయిన్ దేశంలో పుట్టిన ఫెర్రర్... అనంతపురం జిల్లా అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని గోరంట్ల మాధవ్ అన్నారు.
ఫెర్రర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: ఎంపీ గోరంట్ల మాధవ్ - ananthapuram district latest news
పేద ప్రజల అభివృద్ధి కాంక్షించిన ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని హిందూపురం ఎంపీ అన్నారు. అనంతపురంలోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
హిందూపురంలో ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి నివాళలు