అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. ఉరవకొండ మండలంలో రాయంపల్లి, నెరిమెట్ల, గ్రామాల పరిధిలోని వరి, పత్తి పంట పొలాలు నీటమునిగాయి. మండల వ్యవసాయ అధికారి వెంకటప్రసాద్ రైతులతో కలిసి నీట మునిగిన పంటలను పరిశీలించారు. మొత్తం 52 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఎంతమేర నష్టం వాటిల్లిందో వివరిస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. వెంటనే తమకు పరిహారం అందించాలని రైతులు అధికారులను కోరారు.
నీటమునిగిన పొలాలు..పరిశీలించిన వ్యవసాయ అధికారులు - Farms submerged due to heavy rains-inspected agriculture officials
అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మండల వ్యవసాయ అధికారి వెంకటప్రసాద్ రైతులతో కలిసి పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు.
భారీ వర్షాలకు నీటమునిగిన పొలాలు-పరిశీలించిన వ్యవసాయ అధికారులు