ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అనంత' కరవు కష్టం! ఎండిన చెరువులు, అడుగంటిన బోర్లు - రైతుల కన్నీళ్లు పట్టని వైసీపీ పాలకులు - ఏపీలో కరవుపై సీఎం జగన్ వ్యాఖ్యలు న్యూస్

Farmers Worried About Crop Loss Due Lack of Irrigation: అనంతపురం జిల్లా రైతులను కరవు కష్టాలు వెంటాడుతున్నాయి. తీవ్ర వర్షాభావానికి తోడు.. చెరువులు, బోర్లు, బావులలో భూగర్భ జలాలు అడుగంటాయి. హంద్రీనీవా కాలువలో పుష్కలంగా నీరున్నా.. కృష్ణా జలాలను తరలించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. వైసీపీ సర్కారు నిర్లక్ష్య వైఖరి వల్ల పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నామని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

Farmers_Worried_About_Crop_Loss_Due_lack_of_Irrigation
Farmers_Worried_About_Crop_Loss_Due_lack_of_Irrigation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2023, 12:37 PM IST

Updated : Nov 12, 2023, 12:50 PM IST

Farmers Worried About Crop Loss Due Lack of Irrigation: వైసీపీ రైతు ప్రభుత్వమని, తాను పేదల పక్షపాతినని.. ప్రతి సభలోనూ సీఎం జగన్‌ ఊదరగొడతారు. కానీ వాస్తవమేమిటంటే.. జగన్‌ సర్కార్ రైతులకు సరైన సమయానికి సాగునీరు అందించలేక పోతోంది. దీంతో సాగు నీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్పులు తెచ్చిమరీ పంటలపై పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు విడుదల చేయాలని పలుమార్లు మొర పెట్టుకుంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రమంతా కరవు తాండవిస్తుంటే సమీక్ష చేసే తీరిక లేదా? వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ నేతల మండిపాటు

Drought in Anantapur District: అనంతపురం జిల్లా రైతులను కరవు కష్టాలు వెంటాడుతున్నాయి. తీవ్ర వర్షాభావానికి తోడు.. చెరువులు, బోర్లు, బావులలో భూగర్భ జలాలు అడుగంటాయి. చుక్కనీరు లేక నేల నెర్రెలు ఇచ్చి పంటలు ఎండిపోతున్నాయి. హంద్రీనీవా కాలువలో పుష్కలంగా నీరున్నా.. కృష్ణా జలాలను తరలించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. వైసీపీ సర్కారు నిర్లక్ష్య వైఖరి వల్ల పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు.

ఒక్క మండలాన్నీ కరవు జాబితాలో చేర్చని వైసీపీ ప్రభుత్వం - సర్కారు తీరుపై మండిపడుతున్న రైతు సంఘాలు

AP Farmers Problems: అనంతపురం జిల్లాలో కరవు విలయం తాండవం చేస్తోంది. పొలాలు బీటలువారి.. మొక్కలు జీవం కోల్పోయి ఎండిపోయాయి. మూగజీవాలు సైతం నీరు లేక అల్లాడుతున్నాయి. కానీ ముఖ్యమంత్రివర్యులు మాత్రం కాస్త కరువే ఉందంటూ.. రైతుల ఇబ్బందులు తక్కువేనంటూ చెబుతారు. ఉరవకొండ మండలం షేక్షానిపల్లి వివిధ పంటల సాగుకు పెట్టింది పేరు. చెరువు పరిసరాలలో 200కు పైగా బోర్లు, బావులు ఉన్నాయి. సుమారు 2 వేల ఎకరాలలో మిరప, వేరుశనగ, వరి, మొక్కజొన్నతో పాటు అనేక పంటలు వేశారు.

Crop Loss Due Lack of Irrigation: విత్తు నాటింది మొదలు.. రైతులకు వరుణుడు చుక్కలు చూపిస్తున్నాడు. చెరువు కూడా ఎండి భూగర్భ జలాలు అడుగంటాయి. ఫలితంగా నీరందక పంటలు ఎండిపోతున్నాయి. తెలుగుదేశం హయాంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చొరవతో గ్రామంలోని చెరువుకు హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి నీటిని తరలించేవారు. చివరి పంటలకు కూడా నీరందేది.

Lack of Irrigation: కానీ ప్రభుత్వం మారడంఅన్నదాతలకు శాపంగా మారింది. వైసీపీ పాలనలో నాలుగేళ్లుగా చెరువుకు కృష్ణా జలాలు తరలించలేదు. పంటలను కాపాడుకునేందుకు.. రైతులు గత 2 నెలల్లో కొత్తగా దాదాపు 200 వరకు బోర్లు వేయించారు. ఖర్చు తడిసిమోపెడై ఆర్థిక భారం పెరిగినా.. పంటలకు తడులు అందడం లేదు. చేసేదేమీ లేక చాలా మంది రైతులు ఎండిన పంటలను తొలగిస్తున్నారు.

సాగునీరందక రైతుల అవస్థలు - వరి పొలాలకు బీటలు, పొట్టదశలోనే ఎండిపోతున్న పైరు

Last Updated : Nov 12, 2023, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details