రాయితీ విత్తనాల కోసం రైతుల పడిగాపులు
రాయితీ విత్తనాల కోసం రైతుల పడిగాపులు - అనంతపురం
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీలో వేరుశనగ విత్తనాలు పొందేందుకు అన్నదాతల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి.

farmers_waiting_for_subsidy_seeds
వేరుశనగ సాగుకు రెండు వారాలు మాత్రమే గడువు ఉండడంతో విత్తనాలు పొందేందుకు రైతులు ఆరాటపడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలంలోని వేరుశెనగ విత్తన పంపిణీ కేంద్రానికి భారీగా రైతులు తరలివచ్చారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో..పలువురు సొమ్మసిల్లి పడిపోయారు.
Last Updated : Jul 1, 2019, 7:05 PM IST