రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వేరుశెనగ విత్తనాల కోసం గ్రామ సచివాలయంలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు క్యూ కట్టారు. మొదటి దశలో చిన్న, సన్నకారు రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకుని టోకెన్ పొందిన తర్వాత డబ్బులు చెల్లిస్తే అధికారులు నిర్ణయించిన తేదీలో విత్తన వేరుశెనగలు పొందటానికి అవకాశం ఉంటుంది.
అయితే... రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి గ్రామ సచివాలయాలకు వెళితే అక్కడ క్యూలైన్లు చూసి బెంబేలెత్తుతున్నారు. ఇంటర్నెట్ సర్వర్లు మందగమనంతో పని చేస్తున్నాయని.. వీలైనంత ఎక్కువ సమయం కేటాయించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని గ్రామ సచివాలయ ఉద్యోగులు తెలిపారు.