బోరు విషయంలో రైతు ప్రాణాలను పణంగా పెట్టిన ఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం పాతపల్లి గ్రామంలో జరిగింది. రైతు చంద్రశేఖర్ రెడ్డి తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో... సాగు కోసం లక్ష రూపాయలు ఖర్చు చేసి కొత్త బోరును... వేశాడు. పక్క తోట రైతు అభ్యంతరం చెప్పడంతో రెవెన్యూ అధికారులు బోరు సీజ్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో చంద్రశేఖరరెడ్డి కుటుంబం మొత్తం విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతు పొలానికి చేరుకొని సమస్యపై చర్చించారు. ఇన్‌ఛార్జి తహసీల్దార్ ఏకపక్షంగా వ్యవహరించడమే కాకుండా రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
బోరు విషయంలో అన్యాయం... రైతు ఆత్మహత్యాయత్నం - అనంతపురంలో రైతు వార్తలు
అనంతపురం జిల్లా యల్లనూరు మండలం రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అన్యాయం చేశారంటూ ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. లక్ష రూపాయలు ఖర్చుచేసి వేసిన బోరుని రెవెన్యూ అధికారులు సీజ్ చేస్తామని చెప్పడంతో... రైతు కుటుంబం విషం తాగేందుకు సిద్ధమయ్యింది.
Farmer's suicide attempt for water bore issue at yellanuru in ananthapuram district