ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers Suffering Due to Rain Conditions in AP: కీలక సమయంలో ముఖం చాటేసిన వరుణుడు.. రైతు కన్నీరు.. ఉద్యాన శాఖ పొంతనలేని ప్రకటనలు - కీలక సమయంలో ముఖం చాటేసిన వరుణుడు

Farmers Suffering Due to Rain Conditions in AP: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటపొలాలకు సాగునీరు అందక రైతులు కన్నీరు పెడుతున్నారు. 26 జిల్లాల్లోనూ లోటు వర్షపాతంతో అన్నదాత పుట్టెడు కష్టంలో ఉన్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయకుండానే ఉద్యాన శాఖ పొంతన లేని ప్రకటనలను విడుదల చేయడంపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Farmers_Suffering_Due_to_Rain_Conditions_in_AP
Farmers_Suffering_Due_to_Rain_Conditions_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 7:53 AM IST

Farmers Suffering Due to Rain Conditions in AP: కీలక సమయంలో ముఖం చాటేసిన వరుణుడు..అయినా వానలు కురుస్తున్నాయంటున్న ఉద్యాన శాఖ

Farmers Suffering Due to Rain Conditions in AP :రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగులో ప్రభుత్వ ప్రణాళికాలోపానికి తోడు చినుకు జాడ కానరాక రైతులు నిరాశకు గురవుతున్నారు. అక్టోబరులో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే 89 శాతం తక్కువగా వానలు కురిశాయి. అంటే 24 రోజులపాటు దాదాపుగా వానలు లేనట్లే. అన్ని జిల్లాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అటు వానల్లేవు, ఇటు ఎండలు పెరిగాయి.

CM Jagan Careless AboutFarmers : పంటలు ఎండుతుంటే గుండె మండిన రైతులు రోడ్డెక్కుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పండగ చేసుకుంటోంది. వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి కావాల్సినంత తీరిక దొరుకుతోంది. కుంగిపోతున్న రైతు బాగోగులను పట్టించుకునేందుకు మాత్రం క్షణం కూడా కేటాయించడం లేదు. పరిస్థితి రోజు రోజుకూ తీవ్రం అవుతున్నా.. ఉద్యానశాఖ మాత్రం వానలు కురుస్తున్నాయని ప్రకటనలు ఇచ్చి మరీ చెబుతోందంటే క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఎంత అవగాహన ఉందో అర్థం అవుతోంది. రైతుల సంగతి తర్వాత ముందు ప్రభుత్వంపై మాట పడకుండా ఉండాలనే ధోరణిలో వ్యవహరిస్తోంది.

Groundnut Farmers Removing Crop: కరవుతో 'అనంత' రైతు విలవిల.. ఎండిన పంటను తొలగిస్తూ కన్నీటి పర్యంతం

Monsoon Conditions in AP :అక్టోబరు నెలలో నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయి ఈశాన్య రుతుపవనాలు(Northeast Monsoon) ప్రవేశిస్తాయి. పంటలు ఎదిగేందుకు, అధిక దిగుబడులకు ఇది కీలక సమయం. ఐతే ఈ నెలలో లోటు వర్షపాతం నమోదవ్వడమే కాకుండా సెప్టెంబర్‌ నెలలోనూ అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి.

దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలకు పైగా పెరిగాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ దుర్భిక్ష ఛాయలే నెలకొన్నాయి. రాయలసీమ వ్యాప్తంగా చూస్తే సాధారణం కంటే 90 శాతం తక్కువ వానలు కురిశాయి. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఇలాకా వైఎస్సార్ జిల్లాలో 97 శాతం లోటు వర్షపాతం నెలకొంది. కోస్తాలో 88 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

Deficit Rains Cause Huge Crop Loss in Anantapur District: పంట నష్టం 'అనంతం'.. నిండా మునిగిన అన్నదాత.. పరిహారంపైనే ఆశలు!

Farmers Fire on Horticulture Department :రాష్ట్ర వ్యాప్తంగా వరి సహా మెట్ట పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. రైతులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మిరప రైతుల(Chilli Farmers) పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. నీరందక తెగుళ్లు ప్రబలుతున్నాయి. దీనికితోడు వైరస్‌ తీవ్రత అధికంగా ఉండటంతో కొన్నిచోట్ల పంట తొలగిస్తున్నారు.

అయినా ఉద్యానశాఖ కమిషనర్‌ శ్రీధర్‌ మాత్రం మిరప ఆశాజనకంగా ఉందని.. వానలు కురుస్తున్నాయంటూ సోమవారం ప్రకటన విడుదల చేయడం విమర్శలకు తావిస్తోంది. జెమిని వైరస్‌ తీవ్రత ప్రబలుతోందని, తోటలు తొలగిస్తున్నామని రైతులు వాపోతుంటే.. నల్లతామర నివారణకు చర్యలు తీసుకుంటున్నామంటూ ఉద్యానవన శాఖ ప్రకటనలో పేర్కొనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Low Rainfall Conditions in State: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. విద్యుత్‌ కోతలు.. ఇబ్బందుల్లో అన్నదాతలు

ABOUT THE AUTHOR

...view details