ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూగ జీవాలను చంపుకోలేక... అమ్ముకుంటున్నారు - no water

కరవు భూతం మనుఘలతో పాటు మూగజీవాలనూ వెంటాడుతోంది. నీరు, మేత లేక డొక్కలు ఎండి ప్రాణాలను కోల్పోతున్నాయి. పశుపోషణపై ఆధారపడిన రైతులు... వాటి బాధ చూడలేక సంతకు తోలుతున్నారు. తమ కళ్లెదుటే జీవాలు కన్ను మూస్తుంటే ఆ పరిస్థితి చూడలేక.. తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

ఎండిన పొలాల్లో గొర్రెలు(ఫైల్)

By

Published : May 14, 2019, 8:52 PM IST

పోషణ భారమై

అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా కదిరి డివిజన్​లో మూగజీవాల పరిస్థితి దుర్భరంగా మారింది. 15 సంవత్సరాలుగా సరైన వర్షాలు లేనందున అత్యధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కుదేలైంది. పొట్ట నింపుకోవడానికి చిన్న.. సన్నకారు రైతులు కాడెను వదిలి నగరాల బాట పట్టారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పశుపోషణపై ఆధారపడిన వారికీ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా గొర్రెలు... మేకలు పెంపకం ద్వారా జీవనం సాగించే రైతులు... వాటికి మేత అందించలేక సంతలకు తరలించి అమ్ముకుంటున్నారు. సంవత్సరాల తరబడి సరైన వర్షాలు లేక మేత లభించక గొర్రెలు మేకల వృద్ధి తగ్గిపోతోందని... పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు జీవనాధారం ఉండదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details