ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిశ్రమలకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకున్న రైతులు

అనంతపురం జిల్లా మడకశిర మండలం కేతిపల్లి గ్రామంలో పరిశ్రమలకు ఇచ్చిన భూములను రైతులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. భూములిచ్చినా... పరిశ్రమలు రాని కారణంగానే తమ భూములను స్వాధీనం చేసుకుని సాగు చేస్తున్నామని వారు తెలిపారు.

పరిశ్రమలకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకున్న రైతులు
పరిశ్రమలకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకున్న రైతులు

By

Published : Sep 15, 2020, 12:14 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం కేతిపల్లి గ్రామంలో పరిశ్రమలకు ఇచ్చిన భూములను రైతులు స్వాధీనం చేసుకున్నారు. 'ఏపీఐఐసీ రసాయన కంపెనీల ఆక్రమణలో ఉన్న రైతుల భూముల స్వాధీనానికై భూ పోరాటం' అనే ఎజెండాతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏస్ఈజెడ్ భూములను రైతులు దున్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పరిగి, మడకశిర మండలాల్లోని రైతుల నుంచి 2500 ఎకరాల భూమిని 15 సంవత్సరాల క్రితం ఏపీఐఐసీ సెజ్ వారు పరిశ్రమల నిర్మాణం కోసం దౌర్జన్యంగా తీసుకున్నారని చెప్పారు.

15 సంవత్సరాలైనా ఆ భూముల్లో పరిశ్రమలు స్థాపించలేదు. ఉద్యోగాలు రాలేదు. భూమి మొత్తం బీడుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక ఈ రోజు ప్రజా సంఘాల, రైతు సంఘాల ఆధ్వర్యంలో గతంలో ఇచ్చిన పరిశ్రమల భూములను స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఎవరైనా అడ్డగిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించి ఎస్ఈజెడ్ భూములను రద్దు చేసి.. తిరిగి పేదలకు పంచాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details