అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని సుబ్బరాయ సాగర్ డ్యామ్ వద్ద రైతన్నలు వాగ్వాదానికి దిగారు. డ్యామ్ నుంచి 29 వ డిస్ట్రిబ్యూటరీ కాలువకు ఆదివారం అధికారులు నీటిని విడుదల చేశారు. 29వ డిస్ట్రిబ్యూటరీకి నీటిని విడుదల చేశారన్న విషయం తెలుసుకున్నా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామ రైతులు సుబ్బరాయ సాగర్ డ్యాం వద్దకు చేరుకొని నీటిని వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. పుట్లూరు మండలం కడవకల్లు, చెర్లోపల్లి, దొసలేడు, మడ్డిపల్లి గ్రామ రైతులు కూడా అక్కడకు చేరుకోగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాగైనా తమ కాలువలకు నీరు వెళ్లాలంటే తమ కాలువలకు నీళ్లు వెళ్లాలంటూ ఘర్షణ పడ్డారు. అధికారుల సూచనల మేరకే నీటిని 29 వ డిస్ట్రిబ్యూటరీకి నీటి సరఫరా అవుతోందని రైతులందరికీ నచ్చజెప్పారు.
నీటి కోసం రైతన్నల వాగ్వాదం - Farmers' quarrel for water
ఒక ప్రాంత కాలువకు నీటిని విడుదల చేసి... మరొక ప్రాంత కాలువకు నీరు విడుదల చేయడంలేదని రెండు మండలాల రైతులు వాగ్వాదానికి దిగారు. అనంతపురం జిల్లా పుట్లూరులోని సుబ్బరాయసాగర్ డ్యామ్ వద్ద ఆందోళన చేశారు.
సుబ్బరాయసాగర్ డ్యాం వద్ద నీటి కోసం రైతన్నల వాగ్వాదం