ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదే వ్యథ: విత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాత - రైతుల నిరసన

విత్తనాల కోసం అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా రైతులు నిరీక్షిస్తున్నారు. అనంతపురంలో అర్థరాత్రే విత్తనాల కోసం కర్షకులు క్యూ కట్టారు.

అదే వ్యథ: విత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాత

By

Published : Jul 9, 2019, 1:33 PM IST

అనంతపురంలో విత్తనాల పంపిణీ తుది అంకానికి చేరుకుంది. కొరత మాత్రం అలాగే కనిపిస్తుంది. ఓ వైపు అధికారులు విత్తన కొరత లేదని చెబుతున్నారు. రైతులు క్యూ కడుతూనే ఉన్నారు. జిల్లాలో రైతుల తీరు విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని ఓబుళదేవరచెరువుకు... వివిధ గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రే వచ్చారు. ఉదయం వచ్చిన రైతులు టోకెన్లు అయిపోయాయని చెప్పడంతో... రైతులు ఆగ్రహించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ... రోడ్డుపై బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలుకుబడి ఉన్నవారికే విత్తనాలు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఆందోళన చేస్తున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details