అనంతపురం జిల్లా కూడేరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆ మండలానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. గత కొంత కాలంగా కరెంట్ సరఫరాలో.. లోపం, లోవోల్టేజీ కారణంగా మోటర్లు చెడిపోతున్నాయని, ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు వాపోయారు. ఎన్నోసార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో.. వామపక్షాల ఆధ్వర్యంలో రైతులు సబ్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
'లో వోల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటర్లు కాలిపోతున్నాయి'
లో వోల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటర్లు కాలిపోతున్నాయి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో కూడేరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.
farmers protest in ananthapuram
ఓ రైతు కరెంట్ స్తంభం ఎక్కడానికి ప్రయత్నించగా తోటి రైతులు, పోలీసులు కిందకు దింపారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కారించాలని కూడేరు మండలానికి ఇంకొక సబ్-స్టేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రెండు గంటల అనంతరం అధికారులు అక్కడికి చేరుకొని సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.
ఇదీ చదవండి:మరో 10,199 పాజిటివ్ కేసులు.. కోలుకున్న 9,499 మంది