అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం ఏడవులపర్తి గ్రామంలో పంట నష్టపరిహారం చెల్లింపులో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. వేరుశనగ ఈ- క్రాప్ బుకింగ్ చేయడంలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటల నష్టపరిహారం అందేలా చూడాలని కర్షకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన కందులు వేస్తే పూత కూడా రాలేదు. వ్యవసాయ అధికారికి చెప్పినా ఎలాంటి స్పందన లేదు. రైతులు నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్నా అధికారుల పట్టించుకోవట్లేదు. అకాల వర్షానికి వేరుశనగ పంట పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా కుళ్లిపోయింది. ఫలితంగా మేము తీవ్రంగా నష్టపోయాం -రైతులు