పంట నష్ట పరిహారం, వాతావరణ బీమాకు సంబంధించిన జాబితాలో తమ పేర్లు లేవని... ఆగ్రహించిన అన్నదాతలు గ్రామ సచివాలయానికి ఏకంగా కంచె వేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి పంచాయతీ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైతులు సచివాలయ సిబ్బందిని బయటకు పంపి తాళాలు వేసి నిరసన తెలిపారు.
లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేవని సచివాలయానికి కంచె
వాతావరణ బీమాలో తమ పేరు లేదని ఏకంగా సచివాలయానికే కంచె వేసేశారు ఆ గ్రామస్థులు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఏ మాత్రం పనిచేయడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అనంతరం సచివాలయ ఆవరణలో బైఠాయించి ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జాబితాలో పేర్లు లేవని... సచివాలయానికి కంచె
సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు ఏ మాత్రం పనిచేయడం లేదని ... తమ పేర్లు ఎందుకు నమోదు చేయలేదని వారు ప్రశ్నించారు. జాబితాలో నలుగురైదుగురు పేర్లే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంబదూరు మండలం ములకలూరు గ్రామంలోనూ ఇదే విషయమై అన్నదాతలు ఆందోళన చేపట్టారు. గ్రామ సచివాలయానికి తాళాలు వేసి సచివాలయ ఆవరణములో బైఠాయించి ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండీ...భూకబ్జాపై దివ్యాంగురాలి వీడియో వైరల్... మంత్రి నుంచి ఫోన్...