ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers protest: నిలిచిన నీటి సరఫరా.. జాతీయ రహదారిపై రైతుల నిరసన - ap latest news

Farmers protest at ananthapur-ballari national highway: హంద్రీనీవా కాలువకు నీటి సరఫరా నిలిచిపోవడంతో.. రైతులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద.. అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హంద్రీనీవా నీటి కోసం వారం రోజులుగా రైతులు పోరాటం చేస్తున్నా.. అధికారులు స్పందించకపోవటం దురదృష్టకరమని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.

Farmers protest at ananthapur-ballari national highway
నిలిచిన నీటి సరఫరా.. జాతీయ రహదారిపై రైతుల నిరసన

By

Published : Feb 20, 2022, 4:52 PM IST

అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై రైతుల నిరసన

Farmers protest at ananthapur-ballari national highway: హంద్రీనీవా కాలువకు నీటి సరఫరా నిలిచిపోవడంతో.. రైతులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద.. అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హెచ్​ఎల్​సీ (HLC) నుంచి హంద్రీనీవాకు నీటిని మళ్లించి తమను ఆదుకోవాలని రైతులు కోరారు. జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే.. పురుగులమందు తాగి ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు.

అధికారులు స్పందించకపోవటం దురదృష్టకరం..
అరెస్టైన రైతులను తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పరామర్శించారు. హంద్రీనీవా నీటి కోసం వారం రోజులుగా రైతులు పోరాటం చేస్తున్నా.. అధికారులు స్పందించకపోవటం దురదృష్టకరమని అన్నారు. హంద్రీనీవా కాలువను నమ్ముకుని వేల ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నీటిని నిలిపివేశారని మండిపడ్డారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను ఉపయోగించి..రైతుల పంట పొలాలకు నీళ్లు లేకుండా చేశారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details