ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Power cuts: కరెంట్ కోతలపై రైతుల నిరసన.. విద్యుత్​ ఉపకేంద్రానికి తాళం - పి.సిద్ధాపురంలో విద్యుత్​ కోతలపై రైతుల నిరసన

Farmers protest against power cuts: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఆత్మకూరు మండలం పి.సిద్ధరాంపురంలో విద్యుత్‌ ఉపకేంద్రం కార్యాలయానికి తాళం వేసి రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్‌ ఉపకేంద్రం లోపలే సిబ్బందిని ఉంచి తాళం వేశారు. కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామంటేనే తాళం తీస్తామంటూ రైతులు నిరసన చేపట్టారు.

Farmers protest against power cuts
కరెంట్ కోతలపై రైతుల నిరసన

By

Published : Apr 7, 2022, 12:07 PM IST

కరెంట్ కోతలపై రైతుల నిరసన

Farmers protest against power cuts: విద్యుత్ కోతలకు నిరసనగా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.సిద్దరాంపురం విద్యుత్‌ ఉపకేంద్రాన్ని రైతులు ముట్టడించారు. సబ్ స్టేషన్​లో పని చేస్తున్న సిబ్బందిని లోపలి ఉంచి తాళం వేసి నిరసన తెలిపారు. కొద్దిసేపటి తర్వాత తాళం తీశారు. కనీసం ఆరు తడి పంటలకైనా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉద్యోగిని బయటకు విడుదల చేసి రైతులు వాగ్వాదానికి దిగారు. కనీసం ఆరు గంటలైనా కరెంటు ఇవ్వకపోతే పంటలు ఎలా పండించుకోవాలని నిలదీశారు. తాను చిన్న ఉద్యోగినని ఉన్నతాధికారులు చెప్పిన ప్రకారం నడుచుకోవాలని రైతులకు ఉద్యోగి వివరించారు.

ఇదీ చదవండి: Flexi issue: పల్నాడు జిల్లాలో ఫ్లెక్సీల వివాదం..!

ABOUT THE AUTHOR

...view details