ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టాపోయిన తమకు.. పంట పరిహార బీమా అందలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కంబదూరు, కుందుర్పి మండలాలోని.. గ్రామ సచివాలయం సిబ్బందిని బయటకు పంపి, తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. పొలాల్లోని కుళ్లిన పంటలను గ్రామ సచివాలయం ముందు ప్రదర్శించారు. వచ్చే సోమవారంలోగా తమ పేర్లను జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే మండల్లాల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం ముందు నిరవధిక ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
పంట పరిహార బీమా అందలేదని రైతుల ఆందోళన - రైతులకు పంట పరిహార బీమా వార్తలు
ప్రకృతి బీభత్సం వల్ల నష్టపోయిన తమకు... పంట బీమా అందలేదని అనంతపురం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పాడైన పంటలను జిల్లాలోని గ్రామ సచివాలయాల ముందు ప్రదర్శించారు.
పంట పరిహార బీమా అందలేదని రైతుల ఆందోళన