అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో.. రహదారి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. మరికొమ్మదిన్నే నుంచి నల్లగుట్లపల్లికి వెళ్లేందుకు రోడ్డు వేయాలని అధికారులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న రైతులు(farmers agitation) తమ భూమిలో రోడ్డు వేయవద్దంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న మహిళలను బలవంతంగా పోలీసుల జీపుల్లో స్టేషన్కు తరలించారు. పురుషులను బలవంతంగా పక్కకు నెట్టేశారు. ప్రైవేటు భూమిలో రోడ్డు వేస్తున్న వారిని అడ్డుకోవాల్సిన అధికారులు..తమపైనే దౌర్జన్యం చేశారని రైతులు వాపోయారు.
Farmers Agitation: రహదారి వివాదం.. పనులను అడ్డుకున్న రైతులు - ప్రైవేటు భూమిలో రోడ్డు ఎలా వేస్తారని కదిరిలో రైతుల ఆగ్రహం
అనంతపురం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల దౌర్జన్యం కొనసాగుతోంది. మరికొమ్మదిన్నే నుంచి నల్లగుట్లపల్లికి వెళ్లేందుకు రోడ్డు వేయాలని అధికారులు నిర్ణయించగా.. తమ భూమిలో రోడ్డు వేయవద్దంటూ రైతులు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు.
వివాదాస్పదంగా రహదారి నిర్మాణం.. ప్రైవేటు భూమిలో రోడ్డు ఎలా వేస్తారని రైతుల ఆగ్రహం
TAGGED:
కదిరిలో రైతుల ఆందోళన వార్తలు