ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmer's Problems: 'సీఎం గారూ పంటను కాపాడండి.. కరెంటు తీయకండి' - సీఎం గారూ పంటను కాపాడండి అంటూ రైతుల విజ్ఞప్తి

Farmer's problems: రాష్ట్రంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ.. రైతులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు.. పంటను కాపాడాలని వీడియో ద్వారా విజ్ఞప్తి చేసిన తీరు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Farmer's problems with power cuts in andhra pradesh
సీఎం గారూ పంటను కాపాడండి.. కరెంటు తీయకండి

By

Published : Apr 10, 2022, 7:43 AM IST

Farmer's problems: విద్యుత్తు కోతలతో పంట ఎండిపోతోందంటూ.. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం ఎస్‌.కొత్తపల్లికి చెందిన గంగాధర అనే రైతు కన్నీటి పర్యంతమయ్యారు. పంటను కాపాడాలని వీడియోలో ఆయన చేసిన విజ్ఞప్తి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

గంగాధర సొంత పొలం మూడెకరాలు, కౌలుకు తీసుకున్న పదెకరాల్లో మొత్తం వేరుసెనగ వేశారు. కౌలుతో కలిపి సుమారు రూ.2.5 లక్షలు వెచ్చించారు. నీరందిస్తే 20 రోజుల్లో పంట చేతికి వస్తుంది. విద్యుత్తు కోతల వల్ల 2 బోర్లు ఉన్నా చేనుకు తడి అందించలేకపోతున్నారు. ‘వారం రోజులుగా కరెంటు సక్రమంగా ఉండటం లేదు. విద్యుత్తు సక్రమంగా ఇచ్చి పంటను కాపాడండి ముఖ్యమంత్రి గారు’ అంటూ చేసిన విన్నపం చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details