ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాభావ పరిస్థితులు... తీవ్ర నష్టాల్లో వేరుశనగ, కంది రైతులు

అనంతపురం జిల్లాలో వర్షాభావం వెంటాడుతోంది. మూడు వారాలకు పైగా వాన జాడ లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. వేరుశనగ, కంది పంటలు వాడిపోతున్నాయి. మూడేళ్లుగా జిల్లాలో రైతులు ఈ తరహా నష్టాన్నే ఎదుర్కొంటున్నారు.

వర్షాభావ పరిస్థితులు
వర్షాభావ పరిస్థితులు

By

Published : Sep 22, 2021, 3:55 AM IST

అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాగుచేసిన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత రెండేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పశుగ్రాసం కూడా చేతికి రాలేదు. అయితే జూన్‌, జులై నెలలో పుష్కలంగా వర్షాలు కురవడంతో ఈ ఏడాదైనా పంట దక్కుతుందని ఆశించిన రైతులు అప్పు చేసి మరీ సాగుచేశారు. కానీ ప్రస్తుతం ఇరవై రోజులకు పైగా చినుకు జాడలేనందున పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఆగస్టులో 20 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా ఈ నెలలో ఇప్పటికే 56 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం వేరుశనగ, కంది పంటలు పూర్తిగా ఎండిపోవడంతో వర్షం కురిసినా రైతులు ప్రయోజనం లేదంటున్నారు.

ఈ ఏడాది ఖరీఫ్‌లో 6.71 లక్షల హెక్టార్లలో రైతులు సాగుచేశారు. వీటిలో 4 లక్షల హెక్టార్లు వేరుశనగ విత్తనం వేశారు. వరుసగా నష్టాలతో బెంబేలెత్తిన రైతులు ఈసారి 80 వేల హెక్టార్ల భూమిని సాగు చేయకుండా వదిలేశారు. చాలా గ్రామాల్లో కౌలు రైతులు వ్యవసాయం వదిలేసి ఇతరత్రా కూలీ పనులకు వెళ్తున్నారు. వాతావరణ శాస్త్రవేత్తలు వర్షం వస్తుందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం చినుకు రాలని పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పుడు వర్షాలు కురిసినా వేరుసెనగ పంట మాత్రం చేతికొచ్చే పరిస్థితి లేదు.

వర్షాభావ పరిస్థితులు

ఇదీచదవండి.

TDP LEADERS : 'మాపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేయండి'

ABOUT THE AUTHOR

...view details