ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిగుబడి ఉన్నా.. దిగులు తప్పడం లేదు - corona effects on ananthapuram farmers

లాక్​డౌన్​ కారణంగా అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చినా, కొనేవారు లేక నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు.

అనంతపురంలో రైతుల కష్టాలు
అనంతపురంలో రైతుల కష్టాలు

By

Published : Apr 23, 2020, 7:01 PM IST

లాక్​డౌన్​ కారణంగా అనంతపురం జిల్లాలో రైతన్నలు తీవ్ర ఇబ్బందుులు పడుతున్నారు. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన ప్రేమరాజు అనే రైతు, తనకున్న ఎకరాతో పాటు మరో ఎకరన్నర పొలాన్ని కౌలుకు తీసుకుని, గుమ్మడి పంటను సాగు చేశాడు. పంట చేతికొచ్చినా.. లాక్ డౌన్ కారణంగా అమ్మే అవకాశం లేక కొనేవారు కనిపించక, సుమారు 20 టన్నులకు పైగా దిగుబడి వచ్చిన పంట నష్టపోయినట్టు చెప్పాడు. రూ.2.4 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రేమరాజుతో పాటు.. మిగతా రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details