ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారుల సమావేశం - కదిరిలో రహదారి నిర్మాణం కోసం రైతులతో సమావేశం న్యూస్

బాహ్యవలయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారులు అనంతపురం జిల్లా కదిరిలో సమావేశం నిర్వహించారు. కదిరి పరిధిలోని కుటాగుల్ల, కదిరి రెవెన్యూ గ్రామాల పరిధిలో భూములు కోల్పోతున్న రైతుల వివరాలు తెలుసుకున్నారు.

భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారుల సమావేశం
భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారుల సమావేశం

By

Published : Aug 26, 2020, 5:11 PM IST

బాహ్యవలయ రహదారిలో నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు.. భూసేకరణ చట్టానికి అనుగుణంగానే రైతులకు పరిహారం చెల్లిస్తారని తహసీల్దార్ మారుతి తెలిపారు. మరోసారి రెవెన్యూ సిబ్బంది రహదారి విస్తరణ కోసం సేకరించిన భూమికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు.

రైతులు తమకు సంబంధించిన పూర్తి వివరాలను సిబ్బందికి తెలియజేయాలన్నారు. రైతుల వినతులు, అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదనుగుణంగా పరిహారం చెల్లిస్తామని అధికారులు రైతులకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details