ఎన్నికల్లో వైకాపా సృష్టిస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే పరిషత్ ఎన్నికల్లో తెదేపా పాల్గొనట్లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. అధికార పార్టీ చేస్తున్న సంక్షోభాన్ని ప్రజలు గమనించాలన్నారు.
వైకాపా ప్రలోభాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అరాచక పాలనను ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే పార్టీ అధినేత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తెదేపా పాల్గొంటే అరాచక పాలనలో తాము భాగస్వామ్యం ఐనట్లేనని.. ఆ కారణంగా ఎన్నికల్లో తమ కార్యకర్తలు, నాయకులు ఎవరూ పాల్గొనరని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.