టమాటా లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో రైతులు నష్టపోయారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికి... సుమారు మూడు లక్షల రూపాయల విలువైన టమాటా వృధాగా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంబదూరు మండలం వంట రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్ తో పాటు అదే మండలం చెందిన జక్కిరెడ్డిపల్లి కి చెందిన రైతులు చంద్ర, సిద్దన్న, హనుమంతరాయుడులు... పండించిన టమాటాలను అనంతపురం మార్కెట్ లో విక్రయించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.