ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AGRICULTURE: అప్పుల భారంతో.. వ్యవసాయాన్ని వదిలేస్తున్న రైతులు

ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులు. తగ్గుతున్న దిగుబడులు. పగబట్టిన ప్రకృతితో పోరు పడలేక రైతన్న క్రమంగా కాడి వదిలేస్తున్నాడు. గుదిబండలా మారిన అప్పులు తీర్చేందుకు అక్కరకు రాని వ్యవసాయానికి తానే దూరంగా జరుగుతున్నాడు. కుటుంబ పోషణ కోసం పల్లెలను వదిలి పట్నానికి పయనమవుతున్నాడు. అనంతపురం జిల్లాలో కేవలం 40శాతం మంది రైతులు మాత్రమే వ్యవసాయం చేస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

వ్యవసాయానికి దూరం అవుతున్న రైతులు
వ్యవసాయానికి దూరం అవుతున్న రైతులు

By

Published : Sep 26, 2021, 1:25 PM IST

వ్యవసాయానికి దూరం అవుతున్న రైతులువ్యవసాయానికి దూరం అవుతున్న రైతులు

ఖరీఫ్​కు ముందే ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిశాయి. కరవుసీమ రాయలసీమలోనూ జోరు వానలతో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి. అనంతపురం జిల్లాలో హెచ్ఎల్​సీ, హంద్రీనీవా కాలువ కింద 210 వరకు చెరువులు, కుంటలు పూర్తిగా నింపారు. ఎటు చూసినా చెరువులు నిండుకుండను తలపిస్తున్నా.. జిల్లాలో 80 వేల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేయకుండా భూమిని ఖాళీగా వదిలేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని భూమి తల్లినే నమ్ముకున్న రైతన్న ఇక పోరు చేయలేక అలసిపోయాడు. ఏటికేడు పెరుగుతున్న అప్పులతో పంటకు విరామమిచ్చాడు. అనంతపురం జిల్లాలో పరిస్థితులపై హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడు పురేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి.

జిల్లావ్యాప్తంగా 77 గ్రామాల్లో 450 మందికి పైగా రైతులను కలిసిన సర్వే ప్రతినిధులు పంట వేయకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతిని ఎదురించి సాధించిన పంట దిగుబడులకు మద్దతు ధర లభించడం లేదని వారు వాపోయారు. పైగా పెట్టుబడులు రెట్టింపవ్వడంతో కనీసం ఆ సొమ్ము కూడా దక్కడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడం వల్లే ఈసారి పంటలు వేయకుండా భూములు వదిలేసినట్లు తెలిపారు.

అనంతపురం జిల్లా అంటేనే వేరుశనగ పంట గుర్తుకొస్తుంది. అలాంటిది ఈసారి వేరుశనగ విస్తీర్ణం సాధారణం కన్నా గణనీయంగా తగ్గింది. కొంతమంది రైతులు పశువుల మేత కోసం పంట వేయగా.. మరికొందరు పరువు కోసం పంట వేస్తున్నట్లు సర్వేలో చెప్పారు. పరిస్థితులు ఈ విధంగా కొనసాగితే భవిష్యత్‌లో వ్యవసాయం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయరంగ నిపుణులు, మేధావులు, రైతుల అభిప్రాయాలతో రూపొందించిన సర్వే నివేదికను సెంట్రల్ వర్సిటీ ఆచార్యులు పురేంద్ర త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నారు.

ఇవీచదవండి.

BABY SAFE: నిన్న అపహరణకు గురైన చిన్నారి క్షేమం

TRAINS CANCELLATION: గులాబ్ తుపాన్ ప్రభావంతో రైళ్ల రద్దు

ABOUT THE AUTHOR

...view details