ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చినుకు పలకరించక... సాగు నడవక - agriculture

ఓ సారి వర్షం పడగానే ఆశగా వెళ్లి విత్తనాలు కొనుగోలు చేశారు. దుక్కి దున్నడానికి, ఎరువులు కొనడానికి అప్పులు చేశారు. కానీ మబ్బులు మెహం చాటేశాయి. చినుకులు మరోసారి పలకరించలేదు.

అనంత రైతుల కష్టాలు

By

Published : Jul 18, 2019, 10:01 PM IST

అనంతపురం జిల్లాలో వర్షపాత లోటు 44 శాతానికి చేరింది. నైరుతి రుతుపవనాలు ఆగమనం తరువాత జూన్ తొలి వారంలో కురిసిన ఓ మోస్తరు వర్షం మినహా ... ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఎక్కాడా చినుకు రాలలేదు. వేరుశెనగ విత్తనం సిద్ధం చేసుకున్న రైతులు పురుగుపట్టకుండా కాపాడుకోటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రైతులు విత్తనంతో పాటు ఎరువులు వేయాలని అప్పులు చేసి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేసే పనిలో వ్యవసాయశాఖ సమాయత్తమవుతోంది. ఆగస్టు తొలి వారం నుంచి అన్నదాతలకు ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదించింది. జిల్లాలోని పలు గ్రామాల్లో పశువులకు నీరు, పశుగ్రాసం లభ్యత కూడా కష్టంగా మారింది.

వ్యవసాయ శాఖ అధికారితో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details