ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్వర్ మొరాయింపు.. రైతుల అవస్థలు - seeds

పెనుకొండలో విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. విత్తనాల కోసం రోజుల తరబడి తిరిగినా.. ప్రయోజనం లేకుండాపోతుంది.

సర్వర్ మొరాయింపు.. రైతుల అవస్థలు

By

Published : Aug 20, 2019, 1:12 PM IST

సర్వర్ మొరాయింపు.. రైతుల అవస్థలు
అనంతపురం జిల్లా పెనుకొండలో వ్యవసాయశాఖ ఇచ్చే విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఒక్కో రైతుకు ఉచితంగా 12.5 కిలోల ఉలవలు లేదంటే 2 కిలోల కొర్ర విత్తనాలు ఇవ్వనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా సర్వర్​ మొరాయించటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి వ్యవసాయ కార్యాలయం దగ్గరే క్యూలైన్​లో ఉంటూ.. సర్వర్​ ఎప్పుడు పని చేస్తుందా.. విత్తనాలు ఎప్పుడు అందుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే పెనుకొండ మండలానికి 450 క్వింటాళ్ల ఉలవలు, 5 క్వింటాళ్ల కొర్రలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి రాకేష్ నాయక్ చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details